Breaking News
Home / National / డీకే జ్యుడిషియల్ కస్టడీ పొడిగింపు

డీకే జ్యుడిషియల్ కస్టడీ పొడిగింపు

న్యూఢిల్లీ: మనీ లాండరింగ్ కేసులో కర్ణాటక కాంగ్రెస్ సీనియర్ నేత డీకే శివకుమార్ జ్యుడిషియల్ కస్టడీని ఈనెల 25వ తేదీ వరకూ ఢిల్లీ కోర్టు పొడిగించింది. డీకే జ్యుడిషియల్ కస్టడీ ఇవాల్టితో ముగియడంతో ఆయనను ఈడీ అధికారులు కోర్టు ముందు హాజరుపరిచారు. తదుపరి విచారణ కోసం ఆయనను జ్యుడిషియల్ కస్టడీలోనే ఉంచాలని కోర్టును ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కోరింది. డీకేపై ఉన్న మనీ లాండరింగ్ కేసుకు సంబంధించి ప్రశ్నిచేందుకు ఆయన తల్లి, భార్యకు కూడా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సమన్లు పంపిన విషయం విదితమే.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *