Breaking News
Home / Education / ఇంటర్ పరీక్షా ఫీజు చెల్లింపుకు గడువు పొడిగింపు….

ఇంటర్ పరీక్షా ఫీజు చెల్లింపుకు గడువు పొడిగింపు….

హైదరాబాద్‌: ఇంటర్మీడియట్‌ పరీక్షలకు హాజరయ్యే విద్యార్ధులకు ఫీజు చెల్లించేందుకు గడువు పెంచినట్టు తెలంగాణ ఇంటర్మీడియట్‌ బోర్డు ఒక ప్రకటనలో పేర్కొంది. ఇప్పటి వరకూ అక్టోబరు 29వ తేదీ వరకూ గడువు ఉండగా ఇటీవల జరిగిన పరిణామాల నేపథ్యంలో విద్యార్దులకు ఇబ్బందులు కలగకూడదన్న లక్ష్యంతోనే గడువును నవంబరు 4వ తేదీ వరకూ పొడిగించినట్టు బోర్డు కంట్రోలర్‌ ఆఫ్‌ ఎగ్జామినర్‌ తెలిపారు. మార్చి, 2020 సంవత్సరానికి ఇంటర్‌ మొదటి, ద్వితీయ సంవత్సరం రెగ్యులర్‌ విద్యార్థులతోపాటు, ఫెయిలైయిన వారు, ప్రైవేట్‌గా పరీక్షలు రాసే విద్యార్దులకు ఈ వెసులుబాటు కల్పించినట్టు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జూనియర్‌ కాలేజీల యాజమాన్యాలు దీనిని దృష్టిలో పెట్టుకుని విద్యార్ధులకు ఇబ్బంది కలగకుండా చూడాలని ఇంటర్‌బోర్డు పేర్కొంది.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *