ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ సేవలు నిలిచిపోయాయి. ప్రపంచవ్యాప్తంగా ఒక్కసారిగా ఆగిపోవడంతో ట్విట్టర్ వేదికగా నిరసనలు వెల్లువెత్తాయి. ఫేస్ బుక్ లాగిన్ చేయబోతే ‘సారీ, ఏదో పొరబాటు జరిగింది. త్వరగా దానిని సాల్వ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నాం’ అని వచ్చింది. ఇన్స్టాగ్రామ్ హోం పేజీపై ‘ఊప్స్, ఏదో ఎర్రర్ వచ్చింది’ అని వచ్చింది. ఈ కాసేపటిలోనే సోషల్ మీడియా యూజర్లు మిగిలిన ట్విట్టర్ అకౌంట్లపై పడ్డారు. ఏం జరిగిందో అర్థంకాక, #ఫేస్బుక్డౌన్, #ఇన్స్టాగ్రామ్ డౌన్ అనే హ్యాష్ ట్యాగులతో కామెంట్లు చేయడం మొదలుపెట్టారు.
