Breaking News
Home / Film News / ప్రముఖ బాలీవుడ్‌ నటుడు కన్నుమూత

ప్రముఖ బాలీవుడ్‌ నటుడు కన్నుమూత

ముంబై: బాలీవుడ్​ నటుడు , మరాఠీ చిత్ర థియేటర్ నటుడు విజు ఖోటే (77) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సోమవారం తుది శ్వాస విడిచారని బంధువులు ఒక ప్రకటనలో తెలిపారు. ఈరోజు ఉదయం చందన్‌వాడిలో అంత్యక్రియలు నిర్వహించనున్నామని ఆయన మేనకోడలు ఒక ప్రకటనలో తెలిపారు.

ప్రముఖ బాలీవుడ్‌ చిత్రం షోలేలో డెకాయిట్‌ కాలియా పాత్రతో పాపులర్‌ అయిన విజు ”అందాజ్‌ అప్నా, అప్నా” రాబర్ట్‌ పాత్రలో ఆకట్టుకున్నారు. అలాగే ”ఖయామత్ సే ఖయామత్ తక్”, “వెంటిలేటర్” ”జబాన్ సంభాల్కే” లాంటి టీవీ షోలో కూడా నటించారు. ”గల్తీసే మిస్టేక్‌ హో గయా” డైలాగ్‌తో హాస్యనటుడిగా విజు ఖోటే తనదైన గుర్తింపును సాధించారు.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *