హైదరాబాద్: ప్రముఖ నిర్మాత, ప్రసాద్ గ్రూప్ (ఐమ్యాక్స్, ప్రసాద్ లాబ్స్) చైర్మన్ అక్కినేని రమేష్ ప్రసాద్ సతీమణి, శ్రీమతి అక్కినేని విజయలక్ష్మి గురువారం ఉదయం మృతి చెందారు. హార్ట్ ఎటాక్ కారణంగా నిద్రలోనే తుదిశ్వాస విడిచారు. ఆమె వయసు 77 సంవత్సరాలు. ఆమె మద్రాసులో జన్మించారు. రమేష్ ప్రసాద్ తో 1963 జూలైలో వివాహం జరిగింది. ఈ దంపతులకు ముగ్గురు అమ్మాయిలు, ఒక అబ్బాయి. గురువారం సాయంత్రం 4 గంటలకు జూబ్లీహిల్స్ ఫిలింనగర్ సమీపంలో గల మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. విజయలక్ష్మి మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.
