విశాఖ: భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య విశాఖపట్నం వేదికగా జరుగుతున్న తొలి టెస్టు మూడో రోజున ఓ అభిమాని అత్యుత్సాహం ప్రదర్శించాడు. మ్యాచ్ జరుగుతుండగా మైదానంలోకి ప్రవేశించాడు. మైదానంలో ఉన్న క్రికెటర్లతో సెల్ఫీలు దిగేందుకు యత్నించాడు. దీంతో అప్రమత్తమైన సిబ్బంది అతడిని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. అయితే ఆ యువకుడు మైదానంలో పరుగులు పెట్టడంతో అదుపులోకి తీసుకొని పోలీసులకు అప్పగించారు.
