ఫిల్మ్ న్యూస్: తమిళ స్టార్ హీరో విజయ్ కథానాయకుడిగా అట్లీ తెరకెక్కించిన చిత్రం బిగిల్. తెలుగులో ఈ చిత్రం విజిల్ పేరుతో విడుదల విడుదలైంది. స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రంలో విజయ్ ఫుట్ బాల్ కోచ్‌గా కనిపించనున్నారు. నేడు చిత్రం గ్రాండ్‌గా విడుదల కానున్న నేపథ్యంలో తమిళనాట పండుగ వాతావరణం నెలకొంది. అయితే సినిమా రిలీజ్ విషయంలో కొద్ది రోజులుగా పలు చర్చలు జరగగా, ఎట్టకేలకి తమిళనాడు ప్రభుత్వం రిలీజ్‌కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే ఫ్యాన్స్ కోసం నిన్న రాత్రి స్పెషల్ షో వేయలేదని కోపోద్రిక్తులైన విజయ్ ఫ్యాన్స్ థియేటర్ ముందు ఉన్న షాపులకి నిప్పు పెట్టారు. పోలీస్ వాహనాలు, మున్సిపల్ వాహనాలని కూడా తగులపెట్టినట్టుగా తెలుస్తుంది. ఇదంతా సీసీ కెమెరాలలో రికార్డ్ కాగా, వాటిని పరిశీలించిన పోలీసులు 37 మందిని అరెస్ట్ చేసినట్టు సమాచారం. తమిళనాడు కృష్ణగిరి జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ఈ చిత్రానికి మిక్స్ డ్ టాక్ వస్తుంది.
