Breaking News
Home / Film News / కమెడియన్‌ను బెదిరిస్తున్న అభిమానులు…

కమెడియన్‌ను బెదిరిస్తున్న అభిమానులు…

హైదరాబాద్‌: కన్నడ నటుడు యశ్‌ అభిమానులు నన్ను చంపేస్తానని బెదిరిస్తున్నారని కమెడియన్‌ సుదర్శన్‌ రంగప్రసాద్‌ అంటున్నారు. రెండు సంవత్సరాల క్రితం ఓ కామెడీ షోలో రంగప్రసాద్‌ యశ్‌ సినిమాలోని ఓ డైలాగ్‌ను మిమిక్రీ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియో చూసిన యశ్‌ అభిమానులు రంగప్రసాద్‌పై బెదిరింపులకు పాల్పడ్డారు. ఈ మేరకు ఆయన బెంగళూరులోని ఓ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. సోషల్‌మీడియా వేదికగా తనను వేధించవద్దని యశ్‌ అభిమానులను కోరారు. ‘నేను యశ్‌తో కలిసి పనిచేశానని, ఆయన అంటే నాకు అభిమానం ఉందని, నేను చేసిన మిమిక్రీని కొందరు తప్పుగా అర్థం చేసుకుని నన్ను వేధింపులకు గురి చేస్తున్నారు. నేను వారికి ఒకటే చెబుతున్నాను. జోక్‌ను జోక్‌లాగానే చూడండి సీరియస్‌గా తీసుకోకండి. నేను వేరే వాళ్లని బాధపెట్టడానికో, లేక చులకన చేయడానికో ఆ డైలాగ్‌ చెప్పలేదు, నాకు తెలిసినంత వరకూ యశ్‌ కూడా ఇలాంటి ప్రవర్తనను ఇష్టపడడు.’ అని రంగప్రసాద్‌ తెలిపారు.

Check Also

బిగ్ బాస్-3 కంటెస్టెంట్ కు కరోనా..!

Share this on WhatsAppబుల్లి తెరను కరోనా వైరస్ పట్టి పీడిస్తోంది. ఇప్పటికే పలువురు బుల్లి తెర నటీనటులు కరోనా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *