Breaking News
Home / National / ముంబయి ఆల్‌రౌండర్‌ క్రికెట్‌కు వీడ్కోలు…

ముంబయి ఆల్‌రౌండర్‌ క్రికెట్‌కు వీడ్కోలు…

ముంబయి: వెటరన్‌ ముంబయి ఆల్‌రౌండర్‌ అభిషేక్‌ నాయర్‌ ట్విట్టర్ వేదికగా ‘క్రికెట్‌కు వీడ్కోలు పలకడం గౌరవంగా భావిస్తున్నా. నా కెరీర్‌లో అండగా నిలిచినందరికీ ధన్యవాదాలు. క్రికెట్‌లో తిరిగి పునరాగమనం చేయను. దేనిపైనా పశ్చాతాపం లేదు’ అని ట్వీట్‌ చేశాడు. ధోనీ సారథ్యంలో అతడు భారత్ తరఫున మూడు వన్డేలు ఆడాడు. 36 ఏళ్ల అభిషేక్‌ 103 ఫస్ట్‌క్లాస్‌ మ్యాచుల్లో 45.62 సగటుతో 5,749 పరుగులు చేశాడు. దీనిలో 13 శతకాలు, 32 అర్ధశతకాలు ఉన్నాయి. అంతేకాకుండా 31.47 సగటుతో 173 వికెట్లు పడగొట్టాడు. 99 లిస్ట్‌-ఎ మ్యాచులు ఆడిన అతడు 2,145 పరుగులు, 79 వికెట్లు తీశాడు.

అభిషేక్‌ ట్వీట్‌పై టీమిండియా వైస్‌ కెప్టెన్‌ అజింక్య రహానె స్పందించి అతడితో కలిసి ఉన్న ఫొటోని పోస్ట్‌ చేస్తూ ‘ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన ముంబయి భాగస్వామికి అభినందనలు. నీతో కలిసి ఆడినందుకు ఎంతో ఆనందంగా ఉంది’ అని ట్వీట్‌ చేశాడు. న్యూజిలాండ్‌ మాజీ సారథి మెక్‌కలమ్‌ కూడా అభిషేక్‌ నాయర్‌కు శుభాకాంక్షలు తెలిపాడు.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *