గుంటూరు : తుళ్ళూరు మండలం పెదపరిమి గ్రామంలోని కౌలు రైతు అప్పుల బాధ తట్టుకోలేక పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన శుక్రవారం వెలుగులోకి వచ్చింది. తుళ్లూరు మండలం పెదపరిమి గ్రామంలోని మిక్చర్ కాలనీలో నివాసముంటున్న కావూరి సురేష్ (32) అప్పుల బాధ తట్టుకోలేక తాను సాగు చేస్తున్న పత్తి పంటకు వేసేందుకు కొనుక్కు వచ్చిన ఆర్తిన్ పౌడర్ ను తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికులు గమనించి హుటాహుటిన చింతపండు రసం తాగించి ప్రథమ చికిత్స అందించారు. అనంతరం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గుంటూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ.. మృతి చెందాడు.
