అనంతపురం: కూడేరులో వైసీపీ నేతల ఆగడాలు వెలుగులోకి వచ్చాయి. కౌలు రైతుల పేరుతో రైతు భరోసా డబ్బు స్వాహా చేశారు. భూ యజమానులకు తెలియకుండా గుట్టుగా వ్యవహారం నడిపారు. తమ భూములకు కౌలు రైతుల పేరుతో భరోసా ఇవ్వడంపై మండల తహసీల్దార్, పోలీసులకు రైతులు ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంలో నలుగురి ప్రమేయం ఉన్నట్లు తహసీల్దార్ గుర్తించారు. నివేదికను కలెక్టర్‌కు సమర్పించనున్నారు. అయితే తమ పేర్లను మీడియాకు ఎందుకు వెల్లడించారంటూ తహసీల్దార్‌పై వైసీపీ నేతలు దురుసుగా ప్రవర్తించారు.
