అమరావతి: ఏపీలోని కొన్ని జిల్లాల్లో వర్షం బీభత్సాన్ని సృష్టించింది. విజయనగరం, విశాఖ, పశ్చిమ గోదావరి జిల్లాల్లో రెండు రోజులుగా ఎడతెరిపిలేకుండా వర్షాలు కురుస్తున్నాయి. గాజువాకలో తోకాడ చెరువుకు గండి పడింది. కుంచమాంబ కాలనీలోకి వర్షం నీరు వచ్చి చేరుకుంది. ప.గో జిల్లా డెల్టా మండలాల్లో పొలాలు వర్షం నీటితో నిండిపోవడంతో అక్వా రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు.
