Breaking News
Home / States / రైతుల ఆందోళన…హామీ ఇచ్చిన మంత్రి….

రైతుల ఆందోళన…హామీ ఇచ్చిన మంత్రి….

హైదరాబాద్‌: తెలంగాణ వ్యవసాయ, మార్కెటింగ్‌ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి పర్యటన సందర్భంగా సికింద్రాబాద్‌లోని బోయిన్‌పల్లి కూరగాయల మార్కెట్‌యార్డు వద్ద రైతుల ఆందోళనకు దిగడం ఉద్రిక్తతకు దారి తీసింది. కూరగాయల బస్తా 80 నుంచి 60 కిలోలకు తగ్గించాలంటూ హమాలీలు డిమాండ్‌ చేసిన నేపథ్యంలో మార్కెట్‌ కమిటీ కార్యాలయం ముందు రైతులు బైఠాయించి ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలో వికారాబాద్‌ జిల్లా రేగడి మామిడిపల్లికి చెందిన రైతు గోవర్ధన్‌రెడ్డి ఒంటిపై పెట్రోలు పోసుకుని ఆత్మహత్యకు యత్నించగా వెంటనే అప్రమత్తమైన తోటి రైతులు ఆయనపై నీరు చల్లి రక్షించారు. ఆందోళన సమయంలో చేవెళ్లకు చెందిన కృష్ణ అనే మరో రైతు సొమ్మసిల్లి పడిపోగా ఆయన్ను వెంటనే గాంధీ ఆస్పత్రికి తరలించారు.

రాష్ట్రంలో ఏ మార్కెట్‌లోనూ లేని విధంగా బస్తా బరువులపై హమాలీలు వివాదం సృష్టించడం తగదని రైతులు ఆరోపించారు. ఈ అంశాన్ని గతంలో సంబంధిత మంత్రి, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా పరిష్కరించలేదని చెప్పారు. తప్పనిసరి పరిస్థితుల్లోనే ఆందోళనకు దిగాల్సి వచ్చిందన్నారు. రైతుల ఆందోళన నేపథ్యంలో మంత్రి నిరంజన్‌రెడ్డి అక్కడే అధికారులతో సమీక్ష నిర్వహించి అనంతరం ఆందోళన చేస్తున్న రైతుల వద్దకు వచ్చి మాట్లాడుతూ వారం రోజుల్లో సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. దీంతో రైతులు ఆందోళన విరమించారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *