పారిస్: ఉగ్ర నిధుల ప్రవాహాన్ని నియంత్రించడంలో విఫలమైన పాకిస్థాన్ ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ కొరడా నుంచి తప్పించుకున్నది. ఆ దేశాన్ని బ్లాక్‌లిస్టులో పెడుతారని భావించినా పారిస్‌కు చెందిన ఎఫ్ఏటీఎఫ్ మాత్రం కొత్త డెడ్‌లైన్ విధించింది. 2020 ఫిబ్రవరి లోపు ఉగ్రనిధుల ప్రవాహాన్ని నియంత్రించాలని ఎఫ్ఏటీఎఫ్ తన వార్నింగ్‌లో పాక్‌ను కోరింది. 27 లక్ష్యాల్లో పాకిస్థాన్ ఎటువంటి టార్గెట్‌ను చేరుకోలేకపోయినా ఫైనాన్షియల్ టాస్క్ ఫోర్స్ మాత్రం ఆ దేశంపై కనికరం చూపింది. నిధుల ప్రవాహం అంశంలో పూర్తి ప్రణాళికను పాక్ అమలు చేయాలని పారిస్ సంస్థ కోరింది. పాక్‌ను బ్లాక్‌లిస్టులో పెడుతారని ఆశించిన ఇండియా, అమెరికా లాంటి దేశాలకు ఎఫ్ఏటీఎఫ్ తన నిర్ణయంతో ఓ జలక్ ఇచ్చినట్లు అయ్యింది.
