మేడ్చల్: తాగిన మైకంలో ఇద్దరు పిల్లలకూ కూల్‌డ్రింక్‌లో గుళికల మందు కలిపి ఇచ్చి.. అనంతరం తాను కూడా విషం సేవించాడు. మేడ్చల్ జిల్లా రాజా బొల్లారం తండాలో ఈ విషాదం నెలకొంది. తాగిన మైకంలో తన ఇద్దరు పిల్లలు ప్రణీత్, ప్రణయ్‌లకు కూల్ డ్రింక్‌లో గుళికల మందు కలిపి తండ్రి సురేష్ తాగించాడు. ఈ దారుణ ఘటనలో ప్రణీత్ మృతి చెందగా.. సురేష్, ప్రణయ్‌లు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
