Breaking News
Home / Film News / ఫ్యాన్ మేడ్ వీడియోకి ఫిదా అయిన స్టార్ హీరో

ఫ్యాన్ మేడ్ వీడియోకి ఫిదా అయిన స్టార్ హీరో

ఫిల్మ్ న్యూస్: బాలీవుడ్ మోస్ట్ టాలెంటెడ్ హీరో ఆయుష్మాన్ ఖురానా ఆనతి కాలంలోనే మంచి స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. రీసెంట్‌గా ఆయన నటించిన డ్రీమ్ గార్ల్ చిత్రం బాక్సాఫీస్‌ని షేక్ చేస్తుంది. పూజా అనే అమ్మాయిగా ఆయుష్మాన్ నటన ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకుంది. వంద కోట్లకి పైగా వసూళ్ళు రాబట్టిన ఈ చిత్రం ప్రస్తుతం కొన్ని చోట్ల మంచి కలెక్షన్స్‌తో దూసుకెళుతుంది. ఆయుష్మాన్ ఇటీవల అంధాదున్ చిత్రానికి గాను నేషనల్ అవార్డ్ అందుకోగా, ఆయన నటించిన విక్కీ డోనార్, ఆర్టికల్ 15 చిత్రాలు, డ్రీమ్ గార్ల్ చిత్రాలు విమర్శకుల ప్రశంసలు అందుకున్నాయి. అయితే ఆయుష్మాన్ వీరాభిమాని ఒకరు ఆయన నటించిన పలు పాత్రలకి సంబంధించి యానిమేటెడ్ వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేశాడు. దీనికి ఫిదా అయినా ఆయుష్మాన్ ఆ వీడియోని తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ అతనికి ధన్యవాదాలు తెలిపాడు. ప్రస్తుతం అమర్ కౌశిక్ దర్శకత్వంలో బాలా అనే సినిమా చేస్తున్న ఆయుష్మాన్ ఖురానా సూజిత్ సర్కార్ దర్శకత్వంలో గులాబో సితాబో, హితేష్ కెవల్య దర్శకత్వంలో శుభ్ మంగళ్ జ్యాండ సావధాన్ అనే చిత్రాలు చేస్తున్నాడు.

Check Also

బిగ్ బాస్-3 కంటెస్టెంట్ కు కరోనా..!

Share this on WhatsAppబుల్లి తెరను కరోనా వైరస్ పట్టి పీడిస్తోంది. ఇప్పటికే పలువురు బుల్లి తెర నటీనటులు కరోనా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *