Breaking News
Home / States / Andhra Pradesh / Amaravati / వైసీపీ, టీడీపీ మధ్య మాటల యుద్ధం….

వైసీపీ, టీడీపీ మధ్య మాటల యుద్ధం….

  • మీ అత్తగారిని నియమించాము.
  • 50 శాతం రిజర్వేషన్లు కల్పించాము.

అమరావతి: నామినేటెడ్‌ పోస్టులపై అసెంబ్లీలో అధికార వైసీపీ, టీడీపీ మధ్య మాటల యుద్ధం జరిగింది. సలహాదారులు, నామినేటెడ్‌ పోస్టుల్లో ఒకే వర్గానికి ప్రాధాన్యత ఇచ్చారని టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ ఆరోపించారు. లోటు బడ్జెట్‌ ఉన్న రాష్ట్రానికి ఇంత మంది సలహాదారులు అవసరమా అని ప్రశ్నించారు. గతంలో డీఎస్పీల పదోన్నతులపై కూడా వైసీపీ రాజకీయం చేసిందని సత్యప్రసాద్ గుర్తుచేశారు.

ఈ వ్యాఖ్యలకు స్పందించిన సీఎం జగన్ వక్రీకరణలో టీడీపీని మించినవారు లేరని మండిపడ్డారు. నామినేటెడ్‌ పదవుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించిన రాష్ట్రం ఏపీ మాత్రమేనని జగన్‌ చెప్పుకొచ్చారు. తెలుగు అకాడమీ చైర్మన్‌గా చంద్రబాబు అత్తగారిని నియమించామని జగన్‌ చెప్పారు. మార్కెట్‌ యార్డ్‌, దేవాలయ కమిటీ చైర్మన్‌ పోస్టుల్లోనూ 50 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఇచ్చామని ఆయన చెప్పారు. నామినేటెడ్‌ పోస్టుల్లో అన్ని వర్గాలకు ప్రాధాన్యత ఇచ్చామని వివరించారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *