Breaking News
Home / Film News / రూమర్స్‌పై స్పందించిన సినీ నటి…

రూమర్స్‌పై స్పందించిన సినీ నటి…

హైదరాబాద్‌: భారత క్రికెటర్‌ కేఎల్‌ రాహుల్‌తో కథానాయిక నిధి అగర్వాల్‌ డేటింగ్‌లో ఉన్నారంటూ గత కొన్నిరోజుల క్రితం వార్తలు వచ్చాయి. మేమిద్దరం మంచి స్నేహితులం మాత్రమేనని రాహుల్‌ అప్పట్లో కొన్ని ఇంటర్వ్యూలలో చెప్పారు. అయితే తాజాగా మంచులక్ష్మి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ఓ రియాల్టీ షోలో నిధి అగర్వాల్‌ పాల్గొన్నారు. ఇందులో భాగంగా కేఎల్‌ రాహుల్‌తో డేటింగ్‌ ఉందంటూ వస్తున్న రూమర్స్‌పై నిధి స్పందించారు. ‘నేను లండన్‌లో ఉన్నప్పుడు పాకిస్థాన్‌పై ఇండియా క్రికెట్‌ మ్యాచ్‌ గెలిచింది. ఆ సమయంలో నేను భారత క్రికెట్‌ బృందాన్ని కలిసి అభినందించాను. అప్పుడే నేను కేఎల్‌ రాహుల్‌ని కూడా కలిశాను. నాకు రాహుల్‌ బాగా తెలుసు. మేమిద్దరం మంచి స్నేహితులం. మా గురించి వస్తున్న వార్తల్లో ఎంతమాత్రం నిజం లేదు.’ అని నిధి అగర్వాల్‌ వివరించారు.

‘సవ్యసాచి’ సినిమాతో తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమయ్యారు నటి నిధి అగర్వాల్‌. ఆ తర్వాత ఆమె ‘మిస్టర్‌ మజ్ను’, ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ చిత్రాల్లో నటించారు. ఇటీవల విడుదలైన ‘ఇస్మార్ట్‌శంకర్‌’ సినిమా ఆమెకు మంచి విజయాన్ని అందించింది. రామ్‌ కథానాయకుడిగా తెరకెక్కిన ఈ సినిమాకి పూరీ జగన్నాథ్‌ దర్శకత్వం వహించారు.

Check Also

బిగ్ బాస్-3 కంటెస్టెంట్ కు కరోనా..!

Share this on WhatsAppబుల్లి తెరను కరోనా వైరస్ పట్టి పీడిస్తోంది. ఇప్పటికే పలువురు బుల్లి తెర నటీనటులు కరోనా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *