ఫిల్మ్ న్యూస్: విశ్వ నటుడు కమల్ హాసన్ తనయ, ప్రముఖ హీరోయిన్ శ్రుతీ హాసన్ సంచలన విషయం వెల్లడించింది. కొద్ది కాలంగా సినిమాలకు శృతి దూరమైన సంగతి తెలిసిందే. దానికి కారణం ఆమె అనారోగ్యానికి గురి కావడమే అని అప్పట్లో వార్తలు వచ్చాయి. ఆ వార్తలు నిజమే అని తాజాగా శృతి ధ్రువీకరించింది. విపరీతంగా తాగడం వల్లే అనారోగ్యానికి గురయ్యానని మంచు లక్ష్మికి ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించింది.
`నేను విస్కీ బాటిల్ కి బానిసనయ్యా. రెండేళ్లు విపరీతంగా మద్యం సేవించా. దాని వల్ల నా ఆరోగ్యం పాడైంది. అనారోగ్యం నుంచి కోలుకోవడానికి చాలా సమయం పట్టింది. అందుకే ఆ సమయంలో సినిమాలకు దూరమయ్యా. ప్రస్తుతం కెరీర్ పైనే దృష్టి పెట్టాన `ని శృతి తెలిపింది. పవన్ కళ్యాణ్ `కాటమరాయుడు` తర్వాత తెలుగు పరిశ్రమకు దూరమైన శృతి త్వరలో రవితేజ సినిమాతో రీ-ఎంట్రీ ఇవ్వనుంది.