Breaking News
Home / States / Andhra Pradesh / Amaravati / పీపీఏలపై ఆర్థికమంత్రి వ్యాఖ్యలు…

పీపీఏలపై ఆర్థికమంత్రి వ్యాఖ్యలు…

అమరావతి: విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాల పై సోమవారం అసెంబ్లీలో ప్రతిపక్షం అడిగిన ప్రశ్నకు ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి సమాధానం ఇచ్చారు. పవన, సౌర విద్యుత్‌ పర్యావరణ పరిరరక్షణ దష్ట్యా మంచివే.. కానీ అవి ఇప్పుడు ఎంతో వ్యయంతో కూడుకున్నాయన్నారు. మిగతా దేశాలతో జరిగిన ఒప్పందం ప్రకారం ఏ ఏడాది ఏ రంగం నుంచి ఎంత విద్యుత్‌ ఉత్పత్తి చేయాలి అన్న దానిపై స్పష్టత ఉందన్నారు. గత ప్రభుత్వం నిర్ణీత శాతానికి మించి 41 శాతం అధికోత్పత్తికి హడావిడిగా ఒప్పందం చేసుకుందని విమర్శించారు. పీపీఏలపై వేసిన కమిటీ నివేదిక ఇవ్వడానికి ఇంకా సమయం పడుతుందని, టీడీపీకి అంత కంగారెందుకని ప్రశ్నించారు. కమిటీకి కాలపరిమితి అంటూ ఏం లేదన్నారు. గత ప్రభుత్వం పీపీఏల కోసం అర్ధరాత్రి చీకటి ఒప్పందాలు చేసుకుందని, బాబు హయాంలో డిస్కంలకు రూ.20వేల కోట్ల నష్టాలు వచ్చాయని మంత్రి బుగ్గన విమర్శించారు.

టీడీపీ ప్రభుత్వ హయాంలో విద్యుత్‌ ఉత్పత్తి సంస్థకు పెద్ద ఎత్తున బకాయి పడిందని మంత్రి బుగ్గన చెప్పారు. విద్యుత్‌ ఉత్పత్తి సంస్థలకు ప్రభుత్వం 2014-15లో రూ.3910 కోట్లు బకాయి పడగా, ఆ మొత్తం 2018-19 నాటికి ఏకంగా రూ.21,540 కోట్లకు పెరిగిందన్నారు. వాటన్నింటినీ చెల్లిస్తూ వస్తున్నామని, అందుకే అన్ని అంశాలు పరిగణలోకి తీసుకుని విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాల పై సమీక్ష చేపడుతున్నామని మంత్రి స్పష్టం చేశారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *