Breaking News
Home / Uncategorized / చంద్రబాబుపై ఆర్థికమంత్రి వ్యాఖ్యలు…

చంద్రబాబుపై ఆర్థికమంత్రి వ్యాఖ్యలు…

అమరావతి : యూటర్న్ తన జన్మహక్కు అన్నట్టు చంద్రబాబు వ్యవహరిస్తున్నారని ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ అన్నారు. అంశంపై మాట్లాడకుండా రాద్ధాంతం చేస్తున్నారని అన్నారు. సీపీఎస్ రద్దుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది. సీపీఎస్ రద్దుపై మ్యానిఫెస్టోలో కాలపరిమితి ఇవ్వలేదని అన్నారు. మ్యానిఫెస్టోలో ఇచ్చిన అంశాలను కచ్చితంగా అమలు చేస్తామని ఆయన అన్నారు. సీపీఎస్ రద్దుపై ఇప్పటికే మంత్రుల కమిటీ వేశాం అని బుగ్గన అన్నారు. అధికారులతో కూడా మరో కమిటీ ఏర్పాటు చేశామని అన్నారు. వచ్చే ఏడాదికి కమిటీ నివేదిక ఇస్తుందని మంత్రి తెలిపారు. సీపీఎస్ రద్దుపై కొన్ని సంఘాలు రాజకీయం చేయడం సమంజసం కాదని, ఇది లక్షలాది మంది ఉద్యోగులకు సంబంధించిన అంశమని మంత్రి తెలిపారు. ఉద్యోగుల నుంచి వస్తున్న విజ్ఞప్తులను ప్రభుత్వం పరిశీలిస్తోందని అన్నారు

Check Also

ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం ఆదేశం…

Share this on WhatsAppన్యూఢిల్లీ : ప్రాణాంతక కరోనా వైరస్‌ని కట్టడి చేయడంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ‘ఆరోగ్య …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *