Breaking News
Home / National / బ్యాంకుల దీన స్థితికి వారే కారణం….

బ్యాంకుల దీన స్థితికి వారే కారణం….

న్యూఢిల్లీ: దేశంలో బ్యాంకుల దీన స్థితికి కారణం కాంగ్రెస్ పార్టీయేనని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ విరుచుకుపడ్డారు. మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్, ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురాం రాజన్ సమయంలోనే బ్యాంకులకు ఈ దుస్థితి దాపురించిందని పేర్కొన్నారు. వారి హయాంలోనే ఇష్టానుసారంగా లోన్లు ఇచ్చి బ్యాంకులు దివాళా తీసేలా చేశారని అన్నారు.

‘ఇండియన్ బ్యాంకుల గురించి ఆవేదనతో రాజన్ చేసిన వ్యాఖ్యలపై ఎలా స్పందించాలో అర్థం కావడం లేదు. నేను ఈరోజు ఇక్కడ ఉన్నాను. నేను వారికి ఇవ్వాల్సిన గౌరవం ఇస్తాను. కానీ ప్రభుత్వ రంగ బ్యాంకుల దుస్థితికి వారే కారణమని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ప్రభుత్వ రంగ బ్యాంకులు 2011-12లో 9,190 కోట్లు అప్పులు ఇవ్వగా 2013-2014లో 2.16 లక్షల కోట్ల రుణాలు ఇచ్చారని ఆర్‌బీఐ వివరాలు తెలియజేస్తున్నాయని నిర్మలా అన్నారు.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *