Breaking News
Home / National / హైదరాబాద్ లో పర్యటించనున్న ఆర్థిక మంత్రి…

హైదరాబాద్ లో పర్యటించనున్న ఆర్థిక మంత్రి…

న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ రెండురోజుల పాటు హైదరాబాద్‌, బెంగళూరులో పర్యటించనున్నారు. ఆమె పర్యటనకు ఈ నెల 16, 17 తేదీలను ఖరారు చేశారు. బడ్జెట్‌లో ప్రభావితం కానున్న వర్గాలను ఆమె కలవనున్నారు. ”ఆర్థిక మంత్రి ఈ నెల 16,17 తేదీల్లో అధికారికంగా హైదరాబాద్‌, బెంగళూరుల్లో పర్యటించనున్నారు. బడ్జెట్‌లోని వివిధ రంగాల భాగస్వాములతో ఈ సందర్భంగా ఆమె భేటీ కానున్నారు” అని ఆర్థిక మంత్రిత్వ శాఖ ట్విటర్‌లో వెల్లడించింది.

ఈ రెండు నగరాల్లో తొలుత ఆమె వ్యాపార, వాణిజ్య, పారిశ్రామిక వర్గాలు, ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకర్లు, రైతులతో మాట్లాడనున్నారు. ఇక రెండో సెషన్‌లో ఆర్థిక వేత్తలు, పన్ను ప్రాక్టిషనర్లు, విద్యావంతులు, విధాన కర్తలతో భేటీ కానున్నారు. ఈ నెల 1వ తేదీన సీతారామన్‌ కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఇప్పటి వరకు ఈ బడ్జెట్‌ ప్రసంగమే అత్యంత సుదీర్ఘమైంది. దీనిలో ముఖ్యంగా వ్యవసాయం, నీటిపారుదల, నీరు, పారిశుద్ధ్యం, ఆరోగ్య రంగం, విద్య, ఇన్ఫ్రాస్ట్రక్చర్‌ వంటి వాటికి అత్యధిక ప్రాధాన్యం ఇచ్చారు.

Check Also

కరోనా ఊరట..62 శాతం దాటిన రికవరీ రేటు

Share this on WhatsAppదేశంలో కరోనా కరళా నృత్యం చేస్తోంది. పాజిటివ్ కేసులు అంతకంతకూ పెరుగుతూనే ఉన్నాయి. బుధవారం నుంచి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *