రాజోలు : కునవరం గ్రామానికి చెందిన పిల్లి బాలయ్య బ్రెయిన్ ట్యూమర్ వ్యాధితో బాధపడుతున్నారు. విషయం తెలుసుకున్న రాజోలు ఎ1 సేవాసమితి గ్రూప్ సభ్యులు సమకూర్చిన 20 వేల రూపాయలను బాధితుడు బాలయ్యకు అందజేశారు. ఈ సందర్భంగా ఎ1 సేవాసమితి వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీనివాస్ మాట్లాడుతూ… సమాజంలో అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం ఎ1 సేవాసమితి నిరంతర పోరాటం చేస్తుందని, అనారోగ్యంతో బాధపడుతూ కుటుంబ జీవనం కష్టంగా మారిన వారికి ఎ1 సేవాసమితి ఎప్పుడూ అండగా ఉంటుందని, సేవాసమితి సభ్యులు సహాయ సహకారంతో మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు.
