Breaking News
Home / States / Andhra Pradesh / Amaravati / ప్రతి బ్యాంక్‌ ఖాతాదారునికి ఆర్థిక చేయూత

ప్రతి బ్యాంక్‌ ఖాతాదారునికి ఆర్థిక చేయూత

ఎస్‌ఎల్‌బీసీ కన్వీనర్‌ నాంచారయ్య వెల్లడి
అమరావతి: ప్రతి బ్యాంక్‌ ఖాతాదారునికి ఆర్థిక చేయూతనిచ్చేందుకు వివిధ రుణ పథకాలను అందించాలని ప్రభుత్వరంగ బ్యాంకులను కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. దేశవ్యాప్తంగా రెండు దశల్లో 400 జిల్లాల్లో ఈ పథకాలు అమలు చేయనున్నారు. తొలిదశలో ఏపీలోని 10 జిల్లాలను ఎంపిక చేశారు. ఈ జిల్లాల్లో ప్రధాన నగరాల్లో అక్టోబరు 3నుంచి 7వరకూ రుణ మేళాలు నిర్వహించనున్నారు. ‘ఖాతాదారులకు మరింత చేరువగా బ్యాంక్‌ రుణ పథకాలు’ (కస్టమర్‌ ఔట్‌ రీచ్‌) అనే సందేశంతో ‘ముద్ర’తో పాటు విద్య, గృహ, వాహన, పారిశ్రామిక, వ్యవసాయ, వ్యక్తిగత రుణాలను మంజూరు చేయనున్నారు. ఖాతాదారునికి ఏ రుణం కావాలంటే ఆ రుణం ఇవ్వాలని రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ (ఎస్‌ఎల్‌బీసీ) నిర్ణయించింది. ఖాతాదారుని అర్హతను బట్టి దీర్ఘకాలిక రుణాలు, ప్రధానమంత్రి జన్‌ధన్‌ యోజన కింద ఓవర్‌డ్రాఫ్ట్‌ సౌకర్యం కూడా కల్పించనున్నట్లు ఎస్‌ఎల్‌బీసీ కన్వీనర్‌, ఆంధ్రాబ్యాంక్‌ సీజీఎం కేవీ నాంచారయ్య సోమవారం విజయవాడలో మీడియాకు చెప్పారు.

నేటి నుంచి బ్యాంకుల ఏకీకృత పాలన: ఇండియన్‌ బ్యాంకింగ్‌ అసోసియేషన్‌(ఐబీఏ) ఆదేశాల మేరకు అక్టోబరు 1నుంచి రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వరంగ బ్యాంకులు ఏకీకృత సమయపాలను పాటించనున్నట్లు ఆంధ్రాబ్యాంక్‌ డీజీఎం ఎం.వెంకటేశ్వరస్వామి తెలిపారు. 3 రకాలుగా సమయపాలనను నిర్ణయించామని, ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 3 వరకు, ఉదయం 10 నుంచి సాయంత్రం 4 వరకు, ఉదయం 11 నుంచి సాయంత్రం 5 గంటల వరకు బ్యాంకుల సమయపాలన ఉంటుందన్నారు.

ఏ ప్రాంతాల్లో ఎప్పుడు?
3, 4 తేదీలు : కాకినాడ
3, 6 తేదీలు : చిత్తూరు, తిరుపతి
3, 7 తేదీలు : మచిలీపట్నం, విజయవాడ
4, 5 తేదీలు : ఏలూరు, కర్నూలు, కడప
5, 6 తేదీలు : విశాఖపట్నం, గుంటూరు
5, 7 తేదీలు : ఒంగోలు
6, 7 తేదీలు : నెల్లూరు

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *