Breaking News
Home / Featured / ‘ధ్రువీకరణ లేని మాంసం అమ్మితే జరిమానా’

‘ధ్రువీకరణ లేని మాంసం అమ్మితే జరిమానా’

జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ దానకిషోర్‌
హైదరాబాద్‌ సిటీ: జీహెచ్‌ఎంసీ వెటర్నరీ విభాగం ఆమోదం లేని మాంసాన్ని విక్రయిస్తే జరిమానా విధిస్తామని కమిషనర్‌ ఎం.దానకిషోర్‌ మాసం వ్యాపారులను హెచ్చరించారు. సంస్థకు చెందిన కబేళాల్లో వైద్యుల ధ్రువీకరణ అనంతరమే జంతు వధ జరగాలని, ఆ మాంసాన్నే దుకాణాల్లో విక్రయించాలని చెప్పారు. ఈ మేరకు కమిషనర్‌ ఒక ప్రకటనలో గురువారం పేర్కొన్నారు. హోటళ్లు, రెస్టారెంట్లు, ఫంక్షన్‌హాళ్లలో వినియోగించే మాంసానికీ బల్దియా ధ్రువీకరణ తప్పనిసరి అన్నారు. రామ్నా్‌సపురా, అంబర్‌పేట, జియాగూడ, న్యూ బోయిగూడ కబేళాల్లో జంతు వధ జరగుతోందని, ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలని మాంసం వ్యాపారులకు సూచించారు. క్రమం తప్పకుండా దుకాణాలు, హోటళ్లు, ఫంక్షన్‌ హాళ్లలో తనిఖీలు నిర్వహించి ఎలాంటి మాంసం వాడుతున్నారో పరిశీలించాలని అధికారులకు సూచించారు. అనారోగ్యకరమైన మాంసాహారంతో ప్రజలు ఇబ్బందులు పడేపరిస్థితి ఉన్నందున ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. 2018-19 సంవత్సరంలో మెడికల్‌, ఫుడ్‌సేఫ్టీ అధికారులతో కలిసి వెటర్నరీ విభాగం నిర్వహించిన దాడుల్లో 1,728 మందిపై కేసులు నమోదు చేశామని, రూ.2.63 లక్షల జరిమానా వసూలు చేసినట్టు తెలిపారు. 1,798 కిలోల మాం సాన్ని, 6,892 కిలోల బీఫ్‌ను స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు. నగరంలో అనధికారికంగా నిర్వహిస్తోన్న స్లాటర్‌ హౌస్‌లను మూసేస్తామని దానకిషోర్‌ వివరించారు.

Check Also

హైదరాబాద్ బోరబండలో దారుణం…

Share this on WhatsApp  హైదరాబాద్: బోరబండలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. భూతవైద్యం పేరుతో ఓ దొంగ బాబా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *