Breaking News
Home / World News / ప్రపంచంలోనే తొలి యువ ప్రధాని…?

ప్రపంచంలోనే తొలి యువ ప్రధాని…?

హెల్సింకి : ఫిన్లాండ్‌ కొత్త ప్రధానిగా ఎంపికైన సన్నా మారిన్‌ (34), ప్రపంచంలోనే అతి పిన్న వయస్కురాలైన దేశాధినేతగా రికార్డు కెక్కారు. సన్నా మారిన్‌ను అధికార సోషల్‌ డెమొక్రాట్స్‌ పార్టీ కొత్త ప్రధానిగా నియమిం చింది. పార్టీ ఛీఫ్‌ కత్రి కుల్ముని (32) ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ వారం లో మారిన్‌ నేతృత్వం లోని పూర్తి స్థాయి మంత్రి వర్గం ఏర్పాటు కానుంది. ఇప్పటి వరకు ప్రధానిగా వ్యవహరిం చిన సోషల్‌ డెమొక్రాట్‌ నేత ఆంటి రినే గత వారం పోస్టల్‌ సమ్మెను పరిష్క రించ డంలో విఫలమయ్యారంటూ ప్రతిపక్ష సెంటర్‌ పార్టీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం పార్లమెంట్‌ లో నెగ్గడంతో ఆ ప్రభుత్వం కూలి పోయింది. ఐదు పార్టీలతో కూడిన అధికార కూటమిలో నాలుగు పార్టీలు మహిళల నేతృత్వంలో కొనసాగు తున్నవే కావటం విశేషం. కొత్త ప్రధాని మారిన్‌ గతంలో రవాణా మంత్రిగా వ్యవహరించారు.

Check Also

అంతుచిక్కని మరో వైరస్.. వందలాది మంది మృతి

Share this on WhatsAppతమ పొరుగు దేశం కజకిస్థాన్‌లో అంతుచిక్కని వైరస్‌ కారణంగా వ్యాధులు ప్రబలి, వందలాది మంది మృత్యువాత …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *