Breaking News
Home / National / నిత్యానంద కేసు: పోలీసులపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు

నిత్యానంద కేసు: పోలీసులపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు

అహ్మదాబాద్ (గుజరాత్‌): వివాదాస్పద మతగురువు నిత్యానందపై నమోదైన అక్రమ నిర్బంధం కేసు మరో మలుపు తిరిగింది. కోర్టు ఆదేశాల మేరకు 14 మందిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది. అందులో దర్యాప్తు చేసిన పోలీసు అధికారులతో పాటు చైల్డ్‌ వెల్ఫేర్‌ కమిటీ సభ్యులు కూడా ఉండటం గమనార్హం. అహ్మదాబాద్‌లోని తన ఆశ్రమంలో ఇద్దరు అమ్మాయిలతో పాటు ఓ బాలుడిని అక్రమంగా నిర్బంధించి శారీరకంగా వేధించారని నిత్యానందపై ఆరోపణలు వచ్చాయి. దీంతో నిత్యానందతో పాటు శిష్యురాళ్లుగా ఉన్న ఇద్దరు మహిళలపై గతంలోనే పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు ఆశ్రమంలోని పిల్లల విషయంలో అసభ్యంగా ప్రవర్తించారని నిత్యానంద అనుచరుడు గిరీశ్‌ కోర్టును ఆశ్రయించారు. చిన్నారులకు అధికారులు అసభ్యకరమైన వీడియోలు చూపిస్తూ వారిపై భౌతికంగా దాడి చేశారన్నారు. వారిని అడగకూడని ప్రశ్నలు అడుగుతున్నారని తన పిటిషన్‌లో పేర్కొన్నారు.

పిటిషన్‌ను పరిశీలించిన పోక్సో న్యాయస్థానం దర్యాప్తులో పాల్గొన్న పోలీసులతో పాటు బాలల సంక్షేమ సంఘం అధికారులపైనా ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలని ఆదేశించింది. ఈ మేరకు 14 మందిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసినట్లు అహ్మదాబాద్‌లోని వివేకానందనగర్‌ పోలీసులు తెలిపారు. దర్యాప్తులో పాల్గొన్న అధికారుల స్టేట్‌మెంట్లు తీసుకున్నామని పేర్కొన్నారు.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *