Breaking News
Home / National / ఎయిర్ ఇండియా బోయింగ్ విమానంలో అగ్నిప్రమాదం

ఎయిర్ ఇండియా బోయింగ్ విమానంలో అగ్నిప్రమాదం

న్యూఢిల్లీ : ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎయిర్ ఇండియా విమానంలోని పవర్ యూనిట్‌లో బుధవారం అర్ధరాత్రి అగ్ని ప్రమాదం జరిగింది. ఢిల్లీ నుంచి శాన్ ఫ్రాన్సిస్‌కో వెళ్లే 777 బోయింగ్ విమానంలోని ఏసీ యూనిట్ కు మరమ్మతులు చేస్తుండగా ప్రమాదవశాత్తూ విమానం పవర్ యూనిట్ లో మంటలు రేగాయి. ఢిల్లీ విమానాశ్రయంలోని అగ్నిమాపక వాహనాలు వచ్చి ఎయిర్ -ఇండియా బోయింగ్ విమానంలో రేగిన మంటలను ఆర్పారు. అగ్నిప్రమాదం జరిగినపుడు విమానంలో ప్రయాణికులు ఎవరూ లేరని ఎయిర్ ఇండియా అధికారులు చెప్పారు. బోయింగ్ విమానానికి మరమ్మతులు చేస్తుండగా అగ్నిప్రమాదం జరిగిందని, ఇది చిన్న అగ్నిప్రమాదమని ఎయిర్ ఇండియా అధికారులు చెప్పారు.

Check Also

రానున్న 24 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు

Share this on WhatsAppరానున్న 24 గంటల్లో ఉత్తర కాశీ, చమోలీ, డెహ్రాడూన్, పౌరీ, నైనతాల్ జిల్లాలో భారీ నుంచి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *