Breaking News
Home / National / ఫర్నీచర్ మార్కెట్‌లో అగ్నిప్రమాదం… కొనసాగుతున్న సహాయ చర్యలు

ఫర్నీచర్ మార్కెట్‌లో అగ్నిప్రమాదం… కొనసాగుతున్న సహాయ చర్యలు

న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలోని కిరాడీ ప్రాంతంలోని ఫర్నీచర్ మార్కెట్‌లో ఈరోజు ఉదయం అగ్నిప్రమాదం సంభవించింది. సమాచారం అందుకున్న వెంటనే ఫైర్ బ్రిగేడ్ 8 అగ్నిమాపక వాహనాలతో సహా సంఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తోంది. కాగా మార్కెట్‌లో భారీ సంఖ్యలో కలప వస్తువులు ఉండటంతో అగ్నికీలలు అంతటా వ్యాపించాయి. అలాగే మార్కెట్ సమీపంలోని గొడౌన్‌కు కూడా మంటలు అంటుకున్నట్లు సమాచారం. రెండు రోజుల క్రితం అనాజ్ మండీలో జరిగిన అగ్నిప్రమాదం సంఘటన మరచిపోక ముందే ఈ ఘటన చోటుచేసుకోవడం విశేషం.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *