Breaking News
Home / States / Andhra Pradesh / గౌతమ్ మోడల్ స్కూల్ లో అగ్ని ప్రమాదం….

గౌతమ్ మోడల్ స్కూల్ లో అగ్ని ప్రమాదం….

విశాఖపట్నం : జిల్లాలోని పాయకరావుపేట గౌతమ్‌ మోడల్‌ స్కూల్‌లో గురువారం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఇన్వర్ట్ లో అనూహ్యంగా మంటలు చెలరేగడంతో ఈ విషయాన్ని గమనించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్‌ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. కాగా గురువారం నాగుల చవితి రోజున విద్యార్థులకు సెలవు కావడంతో ప్రమాదం తప్పింది. అయితే స్కూల్‌ వాతావరణాన్ని పరిశీలించిన అధికారులు ఫైర్‌ సేఫ్టీ ప్రమాణాలు సరిగ్గా లేవని పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *