Breaking News
Home / States / హీరో హోండా షోరూమ్‌లో అగ్ని ప్రమాదం

హీరో హోండా షోరూమ్‌లో అగ్ని ప్రమాదం

హైదరాబాద్: మలక్ పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ప్రముఖ ద్విచక్ర వాహనాల షోరోమ్.. ఆది హీరో హోండా షో రూమ్‌లో మంటలు ఎగిసిపడ్డాయి. 2వ అంతస్తులో మంటలను చూసి వాచ్ మెన్ పోలీసులకు సమాచారం అందించాడు. దీంతో హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.. అగ్నిమాపక సిబ్బందికి సమాచారమిచ్చారు. వెంటనే ఫైర్ సిబ్బంది అక్కడకు చేరుకుని మూడు ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.

ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదు… కానీ భారీగా ఆస్తి నష్టం సంభవించింది. 50 ద్విచక్ర వాహనాలు, కంప్యూటర్లు, సామగ్రి అగ్నికి ఆహుతి అయ్యారు. సకాలంలో మంటలను అదుపు చేశాము కాబట్టి ఎక్కువ ప్రాణ నష్టం వాటిల్లలేదని అధికారులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *