హైదరాబాద్: నాంపల్లిలోని యం.జే మార్కెట్ వద్ద తెల్లవారుజామున అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. పీవీసీ పైపులను నిల్వ ఉంచిన బిల్డింగ్ లో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు అంటుకున్నట్టు తెలుస్తోంది. ప్లాస్టిక్ వస్తువులు ఉండటంతో భవనంలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. విషయం తెలుసుకున్న అగ్నిమాపక శాఖ అధికారులు, హుటాహుటిన ఘటనా స్థలానికి వచ్చి ఫైరింజన్లతో మంటలను అదుపులోకి తేవడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ ప్రమాదంలో ఎంత నష్టం జరిగిందన్న వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
