Breaking News
Home / States / Andhra Pradesh / ఫోటో స్టూడియోలో అగ్ని ప్రమాదం…

ఫోటో స్టూడియోలో అగ్ని ప్రమాదం…

విజయనగరం: ఎస్‌విఎన్‌ ఫోటో స్టూడియోలో అగ్ని ప్రమాదం సంభవించిన ఘటన మంగళవారం విజయనగరంలో  చోటు చేసుకుంది.  షార్ట్‌సర్క్యూట్‌ కారణంగా అగ్నిప్రమాదం సంభవించింది. స్టూడియో ఉన్న రెండో అంతస్తు నుండి దట్టమైన పొగలు, మంటలు వస్తుండటంతో.. స్థానికులు అగ్నిమాపక శాఖకి సమాచారాన్ని అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదని సమాచారం. ఉదయం కావడంతో సిబ్బంది ఎవరు ఇంకా స్టూడియోకి రాలేదని, స్టూడియో మూసి ఉండడంతో షార్ట్‌సర్క్యూట్‌ని ఎవరూ గమనించలేదని స్థానిక సమాచారం.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *