Breaking News
Home / Film News / రొమాంటిక్ చిత్ర షూటింగ్‌లో అగ్ని ప్ర‌మాదం..

రొమాంటిక్ చిత్ర షూటింగ్‌లో అగ్ని ప్ర‌మాదం..

ఫిల్మ్ న్యూస్: పూరీ జ‌గ‌న్నాథ్ నిర్మాణంలో ఆకాశ్ పూరి, కేతికా శర్మ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం రొమాంటిక్. అనీల్ పాడూరి ఈ చిత్రంతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. ఇటీవ‌ల చిత్ర ఫ‌స్ట్ లుక్ విడుద‌ల కాగా, ఇందులో హీరో హీరోయిన్స్ చాలా రొమాంటిక్‌గా క‌నిపించారు. ఫస్ట్ లుక్ పోస్టర్ అందరినీ మెస్మరైజ్ చేసింది. ఈ సినిమాలో బాలీవుడ్ నటులు మకరంద్ దేశ్ పాండే, మందిరాబేడీ కీలకపాత్రలో నటిస్తున్నారు. అయితే చిత్ర షూటింగ్ హైద‌రాబాద్ ప‌రిస‌ర ప్రాంతాల‌లో జ‌రుగుతుండ‌గా, సెట్‌లో ఆక‌స్మాత్తుగా మంట‌లు వ్యాపించాయి. దీంతో సెట్ ప్రాప‌ర్టీ కొంత దెబ్బ‌తిన్న‌ట్టు తెలుస్తుంది. ఈ ప్ర‌మాదంలో ఎలాంటి ప్రాణ న‌ష్టం జ‌ర‌గ‌లేద‌ని అంటున్నారు.

Check Also

బిగ్ బాస్-3 కంటెస్టెంట్ కు కరోనా..!

Share this on WhatsAppబుల్లి తెరను కరోనా వైరస్ పట్టి పీడిస్తోంది. ఇప్పటికే పలువురు బుల్లి తెర నటీనటులు కరోనా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *