Breaking News
Home / National / అమెరికాలో కాల్పుల కలకలం..

అమెరికాలో కాల్పుల కలకలం..

అమెరికా : అమెరికాలోని ఫ్లోరిడాలో కాల్పుల కలకలం చెలరేగింది. అక్కడి ఓ నౌకాశ్ర‌యంలో సౌదీ ఎయిర్‌ఫోర్స్ ట్రైనర్ కాల్పులకు పాల్ప‌డడంతో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. వెంటనే ప్రతిస్పందించిన పోలీసులు కాల్పులు జరిపిన వ్యక్తిని హ‌త‌మార్చారు. నేవ‌ల్ ఎయిర్‌స్టేష‌న్ పెన్స‌కోలాలో ఈ ఘటన చోటు చేసుకుందని, ఈ కాల్పుల్లో మరో ఎనిమిది మంది గాయ‌ప‌డ్డారని అధికారులు చెప్పారు.

దీనిపై స్పందించిన అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఈ ఘటనను వ్య‌క్తిగ‌తంగా ప‌ర్య‌వేక్షిస్తున్న‌ట్లు తెలిపారు. ఈ ఘటన వెనుక ఉగ్రవాదుల హస్తం ఉందా? అన్న విషయంపై అధికారులు దర్యాప్తు జరుపుతున్నారు. ఈ ఘటనలో కొందరు సౌదీ పౌరులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని ప్రశ్నిస్తున్నారు.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *