Breaking News
Home / National / హరియాణా రేసులో ఫస్ట్ బీజేపీ, సెకండ్ కాంగ్రెస్….

హరియాణా రేసులో ఫస్ట్ బీజేపీ, సెకండ్ కాంగ్రెస్….

న్యూఢిల్లీ: హరియాణా అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపులో బీజేపీ ముందంజలో కొనసాగుతుండగా కాంగ్రెస్ రెండవ స్థానంలో ఉంది. హరియాణాలో సీఎం ఖట్టర్, బబితా ఫోగాట్, కెప్టెన్ అభిమన్యు, అనిల్‌విజ్ ముందంజలో ఉన్నారు. కాంగ్రెస్ నేతలు భూపేంద్ర సింగ్ హుడ్డా, జేజేపీ నుంచి పోటీకి దిగిన కులదీప్ బిశ్రోయీ, దుశ్యంత్ చౌతాలా ముందంజలో ఉన్నారు. అదేవిధంగా దిగ్గజనేతలు అసీమ్ గోయల్, చంద్రమోహన్, రణదీప్ సుర్జేవాలా, మేవాసింగ్ ముందంజలో కొనసాగుతున్నారు. కవితా జైన్ తొలిరౌండ్‌లో ముందంజలో ఉండగా, జీంద్ నుంచి పోటీకి దిగిన జెజేపీ తొలిరౌండ్‌లో 346 ఓట్లతో ముందంజలో ఉంది. ఖర్కోదాలో కాంగ్రెస్ ముందంజలో ఉండగా, జేజేపీ రెండవ స్థానంలో కొనసాగుతోంది. హరియాణాలో బీజేపీ తన సత్తా చాటుతుండగా, కాంగ్రెస్ వెనుకబడింది.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *