Breaking News
Home / States / Andhra Pradesh / తణుకులో తొలి కరోనా కేసు…

తణుకులో తొలి కరోనా కేసు…

తణుకు‌: లాక్‌డౌన్‌ ప్రకటించి రెండు నెలల కాలంలో ఎమ్మెల్యే కారుమూరి వెంకటనాగేశ్వరరావు నిరంతర పర్యవేక్షణతో పోలీసులు పూర్తి అప్రమత్తంగా ఉంటూ తణుకు నియోజకవర్గ వ్యాప్తంగా ప్రజల కదలికలపై నిఘా పెట్టారు. అత్యవసర పనులకే అనుమతిచ్చారు. ఉల్లంఘనలకు తావులేకుండా ఎక్కడిక్కడ వాహనాలను తనిఖీ చేశారు. అయినప్పటికీ కరోనా కేసు నమోదైంది. ఇరగవరం కాలనీలో ఒక ట్రాన్స్‌జెండర్‌కు కరోనా నిర్థారణ కావడంతో తణుకు ప్రజలు ఉలిక్కిపడ్డారు. ముంబయి నుంచి హైదరాబాదు మీదుగా ఈనెల 18న తణుకు వచ్చిన ఆమెను హోం క్వారంటైన్‌లోనే ఉంచి రక్తపరీక్షలు చేయడంతో కరోనా పాజిటివ్‌ వచ్చినట్లు వైద్యులు గుర్తించారు. మొదటి సారిగా తణుకులో కరోనా కేసు నమోదు కావడం కలకలం రేగింది. గురువారం రాత్రి ఆమెను ఏలూరు ఆశ్రం ఆసుపత్రికి తరలించారు. ఆమెకు ప్రైమరీ, సెకండరీ కాంటాక్టులో ఉన్న 9 మందికి పరీక్షలు నిర్వహించి క్వారంటైన్‌కు పంపించినట్లుగా నోడల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ బి.దుర్గామహేశ్వరరావు తెలిపారు.

 

 

Check Also

నరసరావుపేటలో రేపటి నుంచి సంపూర్ణ లాక్‌డౌన్

Share this on WhatsAppనరసరావుపేట: గుంటూరు జిల్లా నరసరావుపేట పట్టణంలో శనివారం నుంచి సంపూర్ణ లాక్‌డౌన్‌ను అమలు చేస్తున్నట్లు ఆర్డీవో ఎం.వెంకటేశ్వర్లు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *