Breaking News
Home / National / సముద్రం అడుగున తొలి హోటల్‌..

సముద్రం అడుగున తొలి హోటల్‌..

న్యూఢిల్లీ : పచ్చని చెట్లను కడుపులో పొదుపుకొని కనువిందు చేసే పర్వత పక్తుల మధ్య నుంచి నీటిపై పడవలో ప్రయాణం చేస్తూ ప్రకృతి అందాలను ఆస్వాదించడం ఎవరికైనా ఇష్టమే. మరి నీటి అడుగున ఇంద్ర ధనుస్సులా సప్త వర్ణాల్లో మెరిసిపోయే పగడపు దీవుల అందాలను తిలకిస్తే, చుట్టూ తిరిగే పలు రంగుల రకాల చేపలతోపాటు షార్కులు, తిమింగళాలు, ఇతర జల చరాలను ఎలాంటి అభద్రతా భావం లేకుండా కనులారా చూస్తుంటే ఆ అనుభూతి ఇంకెంత అందంగా ఉంటుంది? అది ఎలా సాధ్యం అవుతుంది?అలాంటి ఔత్సాహికుల కోసమే ఆస్ట్రేలియాలో మొట్టమొదటి ‘అండర్‌ వాటర్‌ హోటల్‌’ను ఏర్పాటు చేశారు. క్వీన్స్‌లాండ్‌లో పది మిలియన్‌ డాలర్లు (దాదాపు 72 కోట్ల రూపాయలు) వెచ్చించి 14 నెలల్లో పూర్తి చేశారు. జల చరాలను ప్రత్యక్షంగా వీక్షించడం ద్వారా ‘కైమేట్‌ ఛేంజ్‌’ పట్ల ప్రజల్లో అవగాహనకు ఈ హోటల్‌ ఉపయోగపడుతుందన్న కారణంగా క్వీన్స్‌లాండ్‌ రాష్ట్ర ప్రభుత్వం 2.75 మిలియన్ల డాలర్ల ఆర్థిక సహాయంగా అందించింది.

Check Also

భారత్‌లో వివో డిజైన్‌ సెంటర్‌

Share this on WhatsApp50,000కు పెరగనున్న ఉద్యోగుల సంఖ్య ప్రీమియం సెగ్మెంట్‌లో ఎక్స్‌50 స్మార్ట్‌ఫోన్ల ఆవిష్కరణ ధర రూ. 34,990 …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *