విశాఖ: భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య రేపటి నుంచి విశాఖపట్నంలో తొలి టెస్ట్ మ్యాచ్ జరగనుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో కొన్ని రోజులుగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో.. ఈ మ్యాచ్ ను వరుణుడు అడ్డుకుంటాడేమోనన్న సందేహాలు వినిపిస్తున్నాయి. మ్యాచ్ ను వర్షం అడ్డుకునే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. రేపు వర్షం కురవడానికి 80 శాతం అవకాశాలు ఉన్నాయి. నిన్న కూడా విశాఖలో భారీ వర్షం కురిసింది. నిర్వాహకులు యుద్ధ ప్రాతిపదికన నెట్ ప్రాక్టీస్ కు గ్రౌండ్ ను అందుబాటులోకి తీసుకొచ్చారు. దీంతో, రెండు జట్ల ఆటగాళ్లు ప్రాక్టీస్ చేశారు.
