Breaking News
Home / National / తుంగ నదిలో చేపల మృతి…ప్రజల కలవరం

తుంగ నదిలో చేపల మృతి…ప్రజల కలవరం

నది నీరు తాగకుండా తీరప్రాంత గ్రామాల ప్రజల భయాందోళనలు
శివమొగ్గ : కర్ణాటక రాష్ట్రంలోని తుంగ నదిలో చేపలు మృతి చెందాయి. మృతి చెందిన చేపలు నదీ తీరానికి కొట్టుకురావడంతో తీర ప్రాంత గ్రామాల ప్రజలు ఆ నదీ నీరు తాగేందుకు భయాందోళనలు చెందుతున్నారు. తుంగ నీటిని తాగడంతో పాటు పలు అవసరాలకు వినియోగిస్తుంటారు. గత ఆరు రోజులుగా తుంగ నదిలో నీరు ఆకుపచ్చగా మారి చేపలు మరణించాయి. తుంగ నదిలో నీరు కలుషితమై చేపలు మరణించాయని, ఆ నీరు తాగితే తాము కూడా అనారోగ్యం పాలవుతామనే భయంతో నదీ తీరప్రాంత గ్రామాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో అధికారులు తుంగ నదీ నీటితోపాటు మరణించిన చేపలను ఫోరెన్సిక్ పరీక్ష కోసం ల్యాబ్ కు పంపించారు. కొండల మీదుగా ప్రవహిస్తున్న తుంగ నదిలో నీటిని శివమొగ్గ ప్రాంతంలోని పలు గ్రామాలు, పట్టణాల ప్రజలు తాగుతుంటారు. ఈ ఘటనతో ప్రజలు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

Check Also

రానున్న 24 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు

Share this on WhatsAppరానున్న 24 గంటల్లో ఉత్తర కాశీ, చమోలీ, డెహ్రాడూన్, పౌరీ, నైనతాల్ జిల్లాలో భారీ నుంచి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *