కావలసిన పదార్థాలు: (వంజరం లేదా, ముళ్లు తీసిన) చేప ముక్కలు – అరకేజీ, ఉల్లిపాయ – 1, స్ర్పింగ్ ఆనియన్స్ – 1 కట్ట, పచ్చిమిర్చి -4, క్యాప్సికం – 1, అల్లం -అంగుళం ముక్క, వెల్లుల్లి రేకలు – 4, సోయాసాస్ – 2 టీస్పూన్లు, కారం-1 టీ స్పూను, వెనిగర్ -1టీ స్పూను, అజినమోటో – చిటికెడు, మిరియాలపొడి, చక్కెర – పావు టీస్పూను చొప్పున, ఉప్పు – రుచికి తగినంత, నూనె – తగినంత, (రెడ్) ఫుడ్ కలర్ – చిటికెడు.
గ్రేవీ కోసం: కార్న్ ఫ్లోర్ – 4 టేబుల్ స్పూన్లు, బియ్యప్పిండి – 2 టేబుల్ స్పూన్లు, వంటసోడా – రెండు చిటికెలు, కారం – ఒకటిన్నర స్పూను, అజినమోటో – పావు టీస్పూను, ఉప్పు – అర టీ స్పూను.
తయారుచేసే విధానం: గ్రేవీ పదార్థాలన్నీ తగినంత నీటిలో చిక్కగా కలిపి, చేప ముక్కలు ముంచి నూనెలో దోరగా వేగించి పక్కనుంచాలి. 3 టేబుల్ స్పూన్ల నూనెలో తరిగిన క్యాప్సికం, ఉల్లి, స్పింగ్ ఆనియన్స్, పచ్చిమిర్చి, మెదిపిన అల్లం, వెల్లుల్లి వేసి ఒక నిమిషం పెద్దమంటపై వేగించాలి. ఇప్పుడు మంట తగ్గించి సోయాసాస్, కారం, వెనిగర్, అజినమోటో, మిరియాలపొడి, పంచదార వేసి వేగించాలి. తర్వాత చేప ముక్కలు కలిపి మంట పెంచి ముక్కలకు గ్రేవీ బాగా పట్టిన తర్వాత దించేసి, కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి.