Breaking News
Home / States / Andhra Pradesh / Amaravati / మచ్చలేని నేతలు బీజేపీలోకి రావచ్చు….

మచ్చలేని నేతలు బీజేపీలోకి రావచ్చు….

అమరావతి: గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పార్టీ సభ్యత్వానికి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. తాజాగా బీజేపీ నేత రఘురాం మరో బాంబు పేల్చారు. వల్లభనేని వంశీతో పాటు టీడీపీ మరో నేత గంటా శ్రీనివాసరావు కూడా బీజేపీ, వైసీపీని సంప్రదిస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ, వైసీపీతో చర్చించే వంశీ రాజీనామా చేశారని తెలిపారు. వైసీపీ బెదిరింపులకు భయపడాల్సిన అవసరం లేదని… బెదిరింపులు ఉండే నేతలకు బీజేపీ అండగా ఉంటుందని అన్నారు. మచ్చ లేని నేతలు తమ పార్టీలోకి రావచ్చని స్వాగతించారు. రాష్ట్రంలో ఏం జరుగుతోందో వైసీపీ ప్రభుత్వం చెప్పాలని డిమాండ్ చేశారు. ఏపీలో ప్రస్తుతానికి వైసీపీ అధికారంలో ఉన్నప్పటికీ… భవిష్యత్తు బీజేపీదేనని రఘురాం అన్నారు. స్వార్థ రాజకీయాల కోసం పార్టీలు మారేవారిని ప్రజలు నమ్మరని చెప్పారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *