Breaking News
Home / States / Andhra Pradesh / తిరుపతిలో ఫ్లెక్సీలు, బ్యానర్లు నిషేధం

తిరుపతిలో ఫ్లెక్సీలు, బ్యానర్లు నిషేధం

తిరుపతి: తిరుపతి నగరంలో విచ్చలవిడిగా ఫ్లెక్సీలు, బ్యానర్లు కట్టడాన్ని నిషేధించామని కమిషనరు గిరీష వెల్లడించారు. బుధవారం నగరపాలక సంస్థ కార్యాలయంలో ఆయన టౌన్‌ ప్లానింగ్‌ అధికారులతో సమీక్షించారు. నగర పరిధిలో ఫ్లెక్సీలు, బ్యానర్లు కట్టి ఉంటే తొలగించాలని, కట్టిన వారికి అపరాధం వేయాలని అధికారులను ఆదేశించారు. నిబంధనలు ఉల్లంఘించి ఫ్లెక్సీలు, బ్యానర్లు కడితే కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. గురువారం నుంచి నిషేధం అమల్లో ఉంటుందన్నారు. ఈ సమావేశంలో అదనపు కమిషనరు హరిత, అధికారులు శ్రీనివాసులు, షణ్ముగం, సాయిలీల, శారదమ్మ, హసీం, దేవానంద్‌, ప్రసాద్‌ పాల్గొన్నారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *