విజయవాడ: రాష్ట్రంలో ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల వెంకటేశ్వరుడిని దర్శించుకునే భక్తుల కోసం.. విమాన సర్వీసులను నడిపేందుకు ప్రముఖ విమానయాన సంస్థలు ఆసక్తి చూపిస్తున్నాయి. ఎయిర్ ఇండియా ఎయిర్‌లైన్స్, ఇండిగో విమానయాన సంస్థలు రెండూ ఆసక్తి చూపిస్తున్నాయి. ఎయిర్ ఇండియా ఇప్పటికే విమాన సర్వీసుకు సంబంధించి తేదీని ప్రకటించింది. పూర్తి షెడ్యూల్‌ను ఇంకా ప్రకటించాల్సి ఉంది. అక్టోబరు 27 నుంచి ఎయిర్ ఇండియా తిరుపతికి విమాన సర్వీసు నడపనున్నట్టు తెలుస్తోంది. ప్రత్యేకంగా విమా నాన్ని నడపకపోయినా విజయవాడకు సాయంత్రం సమయంలో నడిపే ఎయిర్ ఇండియా ఫ్లైట్‌ను తిరుపతికి కూడా నడపనున్నట్టు సమాచారం. విజయవాడ వచ్చిన తర్వాత తిరుపతికి వెళ్ళి వస్తుంది. ఆ తర్వాతే మళ్ళీ ఢిల్లీ బయలు దేరుతుంది. వారంలో మూడు రోజుల పాటు ఈ విమాన సర్వీసు నడిచే అవ కాశం ఉంది.
మరో రెండు రోజులలో ఎయిర్ ఇండియా తన పూర్తి షెడ్యూల్‌ను ప్రకటించే అవకాశం ఉంది. దేశీయ దిగ్గజ విమా నయాన సంస్థ ఇండిగో కూడా తిరుపతికి విమాన సర్వీసును నడపాలని భావిస్తోంది. ఈ సర్వీసును ఎప్పటి నుంచి ప్రారంభిస్తారన్న దానిపై ఇంకా ఆ సంస్థ తేదీని ప్రకటించలేదు. ఈ సంస్థ త్వరలోనే తేదీని ప్రకటించే అవకాశం ఉంది. విజయవాడ ఎయిర్‌పోర్టు నుంచి తిరుపతికి ప్రస్తుతం ఎలాంటి విమాన సర్వీసులు లేవు. గతంలో నడిచినా పూర్తి స్థాయిలో ప్రారంభం కాలేదు. ప్రస్తుతం తిరుపతికి రెండు విమాన సర్వీసుల సదుపాయం లభించబో తుండటంతో ఈ ప్రాంతవాసులకు మంచి అవకాశం దక్కింది. విజయవాడ ఎయిర్‌పోర్టు నుంచి తిరుపతికి విమాన సర్వీసులు నడిస్తే ఈ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో యాత్రీకులు ఉపయోగించుకునే అవకాశం ఉంది.