Breaking News
Home / Lifestyle / Business / ఫ్లిప్‌కార్ట్ ‘ఫ్లిప్‌స్టార్ట్ డేస్’ సేల్.. 80 శాతం డిస్కౌంట్!

ఫ్లిప్‌కార్ట్ ‘ఫ్లిప్‌స్టార్ట్ డేస్’ సేల్.. 80 శాతం డిస్కౌంట్!

న్యూఢిల్లీ: ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ రేపటి నుంచి ‘ఫ్లిప్‌స్టార్ట్ డేస్’ సేల్ పేరుతో వినియోగదారులపై ఆఫర్ల వాన కురిపించేందుకు సిద్ధమవుతోంది. బుధవారం నుంచి మూడో తేదీ వరకు కొనసాగనున్న ఈ సేల్‌లో 80 శాతం వరకు రాయితీ ఇవ్వనున్నట్టు ప్రకటించింది. యాక్సిస్ బ్యాంకు క్రిడిట్, డెబిట్ కార్డు కొనుగోళ్లపై మరో పదిశాతం తక్షణ రాయితీ ఇవ్వనున్నట్టు తెలిపింది. అయితే, ఇది ఈఎంఐ లావాదేవీలకు మాత్రమే.

జేబీఎల్, సోనీ, బోట్ తదితర కంపెనీల హెడ్‌ఫోన్స్‌పై 70 శాతం డిస్కౌంట్ ఇవ్వనుంది. పవర్ బ్యాంకుల కనీస ప్రారంభ ధర రూ.500. మొబైల్ యాక్సెసరీస్ రూ.99 నుంచి ప్రారంభం కానున్నాయి. ఏసర్, హెచ్‌పీ, డెల్, ఆసుస్, ఇతర కంపెనీల ల్యాప్‌టాప్‌లపైనా ఆకర్షణీయ రాయితీలు అందిస్తోంది. ల్యాప్‌టాప్‌ల కనీస ప్రారంభ ధర రూ.13,990.

టీవీలు, హోం అప్లయెన్సెస్‌పై 75 శాతం డిస్కౌంట్ లభించనుంది. థామ్సన్ 40 అంగుళాల ఫుల్ హెచ్‌డీ స్మార్ట్‌టీవీని రూ.17,499కే సొంతం చేసుకోవచ్చు. ఎంపిక చేసిన టీవీలు, ల్యాప్‌టాప్‌లపై అదనంగా మరో 10 శాతం రాయితీ ఇవ్వనుంది.

Check Also

రానున్న 24 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు

Share this on WhatsAppరానున్న 24 గంటల్లో ఉత్తర కాశీ, చమోలీ, డెహ్రాడూన్, పౌరీ, నైనతాల్ జిల్లాలో భారీ నుంచి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *