విజయవాడ: ప్రకాశం బ్యారేజ్ వద్ద వరద ఉధృతి కొనసాగుతోంది. బ్యారేజ్ వద్ద ప్రస్తుతం ఇన్ఫ్లో 6లక్షల క్యూసెక్కులు కాగా.. 4.8లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. కృష్ణా నదీ పరీవాహక ప్రాంత ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా విపత్తుల నిర్వహణ శాఖ కమీషనర్ సూచించారు.
