Breaking News
Home / States / Andhra Pradesh / సాగర్‌, ప్రకాశం బ్యారేజీలకు వరద పోటు

సాగర్‌, ప్రకాశం బ్యారేజీలకు వరద పోటు

శ్రీశైలానికి 5.58లక్షల క్యూసెక్కులు
ఈ ఏడాది ఏడోసారి క్రస్ట్‌గేట్ల ఎత్తివేత
సాగర్‌, ప్రకాశం బ్యారేజీలకు వరద పోటు
శ్రీశైలం/ఆదోని/విజయపురిసౌత్‌/విజయవాడ: కృష్ణమ్మ ఉరకలు ఆగడం లేదు. ఎగువన కురుస్తున్న వర్షాలకు కృష్ణా పరీవాహక ప్రాంతంలోని ప్రాజెక్టులకు మరోసారి వరద పోటెత్తింది. శ్రీశైలం, నాగార్జునసాగర్‌ జలాశయాలు ఇప్పటికే నిండుకుండల్లా మారగా, భారీ వరద ప్రవాహంతో పెద్దఎత్తున నీటిని దిగువకు వదులుతున్నారు. శ్రీశైలం డ్యాంకు ఇన్‌ఫ్లో పెరగడంతో బుధవారం తెల్లవారుజామున ఏడు క్రస్ట్‌గేట్లు తెరిచి నీరు విడుదలచేశారు. వరద పెరగడంతో ఉదయం 9గంటలకు మరో 3 గేట్లను కూడా ఎత్తేశారు. ఈ ఏడాది జలాశయం గేట్లను ఎత్తి నీరు విడుదల చేయడం ఇది ఏడోసారి కావడం విశేషం. డ్యాం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు, గరిష్ఠ నీటినిల్వ సామర్థ్యం 215.8070 టీఎంసీలు రాగా, సాయంత్రం 6గంటలకు 884.80 అడుగుల వద్ద 214.3637 టీఎంసీల నిల్వ ఉంది. జలాశయానికి 5,58,807 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉంది. డ్యాం 10 రేడియల్‌ క్రస్ట్‌గేట్లను 15అడుగుల మేర ఎత్తి 3,78,640 క్యూసెక్కులు దిగువకు ఇస్తున్నారు. జలాశయం నుంచి ఔట్‌ఫ్లో 4,47,455 క్యూసెక్కులు. కాగా, ఈ ఏడాది ఆగస్టు 9న డ్యాం క్రస్ట్‌గేట్లు తెరచి సాగర్‌కు నీరు విడుదల చేశారు.

ఆ తర్వాత సెప్టెంబరు 9న,19న, 26న, అక్టోబరు 9న, 13న గేట్లు తెరిచారు. 1994 తర్వాత ఒకే ఏడాది ఇన్నిసార్లు క్రస్ట్‌గేట్లు ఎత్తిన దాఖాలాలు లేవని అధికారులు చెబుతున్నారు. ఇదిలాఉండగా, తుంగభద్ర డ్యాంకు భారీ వరద వస్తుండడంతో బుధవారం 33గేట్లు ఎత్తి 1,71,794 క్యూసెక్కులు విడుదల చేశారు. ప్రస్తుతం డ్యాంలోకి 1,44,749 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉంది. కాగా, ఎగువన ఉన్న శ్రీశైలం నుంచి బుధవారం నాగార్జునసాగర్‌కు 4,45,455 క్యూసెక్కులు వచ్చి చేరింది. దీంతో ప్రాజెక్టు 18క్రస్ట్‌గేట్లను 15అడుగుల మేర ఎత్తి 3,91,050 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు.

ప్రకాశం బ్యారేజీకి మళ్లీ వరద
సాగర్‌, పులిచింతల ప్రాజెక్టు నుంచి భారీగా వరద నీటిని దిగువకు విడుదల చేస్తుండటంతో ప్రకాశం బ్యారేజీకి వరద పోటెత్తింది. పులిచింతల నుంచి 4.20లక్షల క్యూసెక్కులు వచ్చి చేరుతోంది. దీంతో బ్యారేజీ 70గేట్ల ద్వారా 1,63,250 క్యూసెక్కులు కిందికి వదులుతున్నారు. ఇందులో 30 గేట్లను నాలుగు అడుగులు, మరో 40 గేట్లు మూడు అడుగుల మేర ఎత్తారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *