ముంబయి: ఎలక్ట్రానిక్స్ తయారీదారు శాంసంగ్ తన మడతబెట్టే స్మార్ట్‌ఫోన్ గెలాక్సీ ఫోల్డ్‌ను భారత మార్కెట్లో ఇవాళ విడుదల చేసింది. ఇందులో 7.3 ఇంచుల ప్రైమరీ డిస్ప్లే, 4.6 ఇంచుల సెకండరీ డిస్ప్లేలను ఏర్పాటు చేశారు. ఈ ఫోన్లో స్నాప్‌డ్రాగన్ 855 ప్రాసెసర్, 12 జీబీ ర్యామ్‌లను ఏర్పాటు చేసినందున ఫోన్ అద్భుతమైన ప్రదర్శననిస్తుంది. ఇక ఈ ఫోన్ కేవలం కాస్మోస్ బ్లాక్ కలర్ ఆప్షన్లో మాత్రమే విడుదల కాగా రూ.1,64,999 ధరకు ఈ ఫోన్ వినియోగదారులకు అక్టోబర్ 20వ తేదీ నుంచి లభ్యం కానుంది. దీనికి గాను అక్టోబర్ 4వ తేదీ నుంచి ప్రీ ఆర్డర్లను ప్రారంభించనున్నారు. శాంసంగ్ ఇండియా ఆన్లైన్ స్టోర్, శాంసంగ్ షాప్, శాంసంగ్ ఆఫ్‌లైన్ స్టోర్స్‌లో ఈ ఫోన్‌ను ప్రీ ఆర్డర్ చేయవచ్చు.
శాంసంగ్ గెలాక్సీ ఫోల్డ్ ఫీచర్లు…
* 7.3 ఇంచ్ డైనమిక్ అమోలెడ్ మెయిన్ డిస్ప్లే
* 4.6 ఇంచ్ హెచ్డీ ప్లస్ సూపర్ అమోలెడ్ కవర్ డిస్ప్లే
* ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 855 ప్రాసెసర్, 12 జీబీ ర్యామ్, 512 జీబీ స్టోరేజ్
* ఆండ్రాయిడ్ 9.0 పై, 12, 12, 16 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరాలు
* 10, 8 మెగాపిక్సల్ డ్యుయల్ సెల్ఫీ కెమెరాలు, 10 మెగాపిక్సల్ కవర్ కెమెరా
* డాల్బీ అట్మోస్, సైడ్ మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్టీఈ
* బ్లూటూత్ 5.0, 4380 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్, వైర్లెస్ చార్జింగ్