Breaking News
Home / National / IPC, CRPCల్లో మార్పునకు ..

IPC, CRPCల్లో మార్పునకు ..

ఢిల్లీ: దేశంలో మూక దాడులను నియంత్రించడమే లక్ష్యంగా చట్టాన్ని మార్చే యోచనలో ఉన్నట్టు కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా వెల్లడించారు. ఇందుకోసం ఇప్పటికే రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు లేఖలు రాసినట్లు తెలిపారు. బుధవారం ఆయన రాజ్యసభలో మాట్లాడుతూ.. ”నేర శిక్షాస్మృతి (సీఆర్‌పీసీ), భారత శిక్షాస్మృతి (ఐపీసీ)లలో మార్పులు తీసుకొచ్చేలా పనిచేస్తున్నాం. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్రం లేఖలు రాసింది. సీఆర్పీసీ, ఐపీసీలో అవసరమైన మార్పులు చేసేలా కమిటీని కూడా ఏర్పాటు చేశాం. ఆ కమిటీ సలహాలను అధ్యయనం చేసి చట్టంలో మార్పులు చేసే అంశాన్ని పరిశీలిస్తాం” అని అమిత్‌ షా వివరించారు.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *